Sep-15 Gold Rate: ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరగా, ఇప్పుడు స్వల్పంగా తగ్గాయి. శనివారం తగ్గిన రేట్లు, ఈరోజు కూడా కొద్దిగా పడిపోయాయి. బులియన్ మార్కెట్ ప్రకారం సెప్టెంబర్ 15న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,01,800, 24 క్యారెట్ల ధర రూ.1,11,060గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కూడా ఇదే రేట్లు నమోదయ్యాయి. ఢిల్లీలో మాత్రం 22 క్యారెట్ల ధర రూ.1,01,950, 24 క్యారెట్ల ధర రూ.1,11,210గా కొనసాగుతోంది. ధరలు ఎక్కువగా ఉండటంతో సాధారణ ప్రజలు తప్పనిసరి అయితేనే బంగారం కొనుగోలు చేస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం ఈ వారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
వెండి ధరలు గత రెండు రోజులు పెరిగినా, ఈరోజు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,33,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,43,000గా ఉంది. దేశంలోని ఇతర నగరాల్లో రేట్లలో తేడాలు ఉంటున్నాయి. ఉదాహరణకు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలో వెండి ధర రూ.91,33,000గా నమోదైంది. ఇలా ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది.
Internal Links:
External Links:
పసిడి ప్రియులకు ఊరట.. దిగొచ్చిన బంగారం ధరలు!