Silver and Gold Rates: కొన్ని రోజుల క్రితం లక్ష రూపాయలు దాటి పెరిగిన బంగారం ధర, తర్వాత కొద్దిగా తగ్గినప్పటికీ తాజాగా మళ్లీ వేగంగా పెరుగుతోంది. వరుసగా మూడు రోజులుగా భారీగా పెరుగుతూ మరోసారి లక్షకు చేరువైంది. గురువారం రూ.200, శుక్రవారం రూ.550, శనివారం (జూలై 12) రోజు రూ.650 పెరిగింది. ఈ నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,710గా, 22 క్యారెట్ల ధర రూ.91,400గా నమోదైంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఈ ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.91,550గా, 24 క్యారెట్లు రూ.99,860గా ఉంది.
ఇక వెండి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. గత వారం వరకు స్థిరంగా ఉన్నప్పటికీ, చివరి రెండు రోజుల్లో భారీగా పెరిగాయి. నిన్న కిలో వెండి ధర రూ.1,000 పెరగగా, ఈరోజు ఏకంగా రూ.4,000 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,15,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ.1,25,000గా ఉండగా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో రూ.1,15,000గా కొనసాగుతోంది.
Internal Links:
మగువలకు గుడ్‌న్యూస్, తగ్గిన బంగారం ధరలు..
External Links:
భారీ షాకిస్తున్న బంగారం.. మళ్లీ లక్షకు చేరువలో పసిడి! వెండిపై ఏకంగా 4 వేలు