Gold Rates

Silver Price Hike: దేశవ్యాప్తంగా బంగారం మరియు వెండి ధరలు గత కొన్ని నెలలుగా వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వెండి ధర బంగారం కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోతోంది. ఈ రోజు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,41,220కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.1,28,350గా నమోదైంది. అయితే అసలు ఆశ్చర్యం వెండి ధరలోనే కనిపించింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.2.54 లక్షలుగా ఉండగా, ఈ రోజు ఒక్కరోజే ఏకంగా రూ.20,000 పెరిగి రూ.2.74 లక్షలకు చేరింది. గురువారం కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉండగా, శుక్రవారం రూ.9,000 పెరిగి రూ.2.54 లక్షలకు చేరింది. అంటే రెండు రోజుల్లో కలిపి వెండి ధర దాదాపు రూ.29,000 పెరిగినట్లైంది.

ద్రవ్యోల్బణం, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి, రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు వంటి కారణాల వల్ల బులియన్ మార్కెట్‌లో బంగారం మరియు వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాలతోనే పెట్టుబడిదారులు మళ్లీ బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. తరతరాలుగా బంగారం, వెండి లోహాలను స్థిరమైన పెట్టుబడిగా భావిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీర్ఘకాలిక పెట్టుబడికి వెండి మంచి ఎంపికగా మారుతోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…

పసిడి ప్రియులకు మళ్లీ షాక్…

External Links:

ఆశ్చర్యం.. ఒక్కరోజే రూ.20 వేలు పెరిగిన వెండి ధర..!

By Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *