Stock Market Big Down: దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్ భారీగా పడిపోతోంది. సోమవారం ఉదయం కూడా మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 2,321 పాయింట్లు తగ్గి 76,596 వద్ద ఉండగా, నిఫ్టీ 686 పాయింట్లు పడిపోయి 23,764 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఆసియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్ నష్టాల్లో ఉండగా.. ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా లాభాల్లో ఉన్నాయి.
మధ్యప్రాచ్యంలోని యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. గత వారం మొత్తం లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ప్రస్తుతం ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో చమురు, గ్యాస్ సంక్షోభం వచ్చే అవకాశం ఉందనే భయంతో మార్కెట్ పడిపోతుంది. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..
External Links:
స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు