దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాల్లోకి జారుకుంది. సోమవారం లాభాలతో ప్రారంభమై, ముగింపులో భారీ లాభాలతో సూచీలు ముగిశాయి. ఇక మంగళవారం ఉదయం కూడా లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరికి అమ్మకాల ఒత్తిడితో నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు నష్టపోయి 81, 820 దగ్గర ముగిసింది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 20, 057 దగ్గర ముగిసింది.
సెన్సెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడగా బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.