గురువారం ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానాలు ప్రకటించింది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లోకి వెళ్లినట్లే వెళ్లి నష్టాల్లో వర్తకమయ్యాయి. అయితే శుక్రవారం కొనుగోళ్లు భిన్నంగా కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కలిసి రావడంతో శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. అన్ని రంగాల సూచీలు చివరి వరకు భారీ లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ 819 పాయింట్లు లాభపడి 79,705 వద్ద ముగిసింది. నిఫ్టీ 250 పాయింట్లు లాభపడి 24,367 వద్ద ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.96 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.

నిఫ్టీలో ఐషర్ మోటార్స్, ఒఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ మరియు శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్‌గా కొనసాగగా బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, దివీస్ ల్యాబ్స్ మరియు సన్ ఫార్మా నష్టపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *