అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ల కారణంగా నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ట్రంప్ నిర్ణయం మన మార్కెట్లను మాత్రమే కాకుండా ఆసియాలోని అన్ని మార్కెట్లను కుదిపేసింది. మన మార్కెట్లలో ఐటీ, మెటల్, ఫార్మా సూచీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 930 పాయింట్లు కోల్పోయి 75,364 వద్ద ముగిసింది. నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోయి 22,904కి పడిపోయింది.
బిఎస్ఇ సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడినవి: బజాజ్ ఫైనాన్స్ (1.43%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1.30%), నెస్లే ఇండియా (0.79%), ఐసిఐసిఐ బ్యాంక్ (0.38%), ఏషియన్ పెయింట్స్ (0.27%).
అత్యధికంగా నష్టపోయినవి: టాటా స్టీల్ (-8.59%), టాటా మోటార్స్ (-6.15%), ఎల్ అండ్ టి (-4.67%), అదానీ పోర్ట్స్ (-4.38%), ఇండస్ఇండ్ బ్యాంక్ (-3.83%).