Stock Market Recover Today: దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. గురువారం భారీ నష్టాలు చూసిన మార్కెట్‌లో దాదాపు రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అయితే ఈరోజు ఇన్వెస్టర్లు ఆ నష్టాన్ని కొంతవరకు పూడ్చుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. సెన్సెక్స్ 361 పాయింట్లు పెరిగి 82,859 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 25,581 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఎల్ అండ్ టీ, ఐషర్ మోటార్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లాభపడగా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో ఉన్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్థిరంగా ఉన్నాయి.
గురువారం ఇరాన్-అమెరికా యుద్ధ భయాల కారణంగా మార్కెట్ క్షీణించింది. కానీ ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. అణు ఒప్పందంపై చర్చల కోసం ఇరాన్‌కు ట్రంప్ 10 రోజుల గడువు ఇవ్వడం మార్కెట్‌కు ఉపశమనం కలిగించింది. దీంతో ఈరోజు మార్కెట్‌లో మంచి ఉత్సాహం కనిపిస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..
External Links:
స్టాక్ మార్కెట్‌కు జోష్.. భారీ లాభాల్లో సూచీలు