దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ వీక్లీ గడువు ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 60 పాయింట్లకు పైగా బలహీనపడింది. బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో 9.50 గంటల సమయానికి మార్కెట్లు నష్టాల నుంచి లాభాల్లోకి వస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ 142 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 33 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్లు లాభపడ్డాయి. మార్కెట్‌కు ఐటీ వాటాల నుంచి మద్దతు లభించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైస్, టాటా స్టీల్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టిసిఎస్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో 24% తగ్గుదలని నివేదించిన తర్వాత ఏషియన్ పెయింట్స్ వాటా ధర 4% పైగా పడిపోయింది. కంపెనీ నికర లాభం రూ. 1,550 నుంచి రూ. 1,170 కోట్లుకు తగ్గింది.