ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు సూచీల పై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 112 పాయింట్ల లాభంతో 80,772 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 24,616 వద్ద వ్రతకమవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.54 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ – 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, హెచ్యుఎల్, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్సర్వ్ , హెచ్‌సీఎల్ టెక్, ఎన్టిపిసి, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ వాటాలు లాభాల్లో ఉన్నాయి. ఎల్ అండ్ టీ, నెస్లే ఇండియా , టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, టాటా మోటార్స్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ వాటాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.