దేశీయ మార్కెట్‌లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు కూడా మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 80,039 వద్ద ముగిసింది. నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 24,406 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.70 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాటా మోటార్స్, ఒఎన్‌జిసి, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, బిపిసిఎల్, సన్ ఫార్మా లాభపడగా, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, టైటాన్ కంపెనీ, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్స్ నష్టపోయాయి. రంగాల వారీగా ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, మీడియా 0.5-3 శాతం లాభపడగా, బ్యాంకులు, ఐటీ, స్టార్టప్‌లు, రియల్టీ, టెలికాం 0.5-1 శాతం మధ్య క్షీణించాయి.