Today Price of Gold

News5am, News Headlines Telugu (21-05-2025): బంగారం ధర భారీగా పెరిగింది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు మరింత పెరిగినట్లు గమనించవచ్చు. మే 21వ తేదీ బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,620 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,500 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 99,238 పలుకుతోంది. బంగారం ధరలు గరిష్ట స్థాయి నుంచి కూడా నెమ్మదిగా తగ్గుతూ ప్రస్తుతం మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర దాదాపు 1000 రూపాయలు పెరిగింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితుల్లో ఒక కారణంగా చెప్పవచ్చు.

ముఖ్యంగా ప్రస్తుతం మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వాడి సంఖ్య కూడా పెరుగుతుంది ఇది కూడా బంగారు ఆభరణాల ధరలు పెరుగుదలకు ఒక కారణం అవుతుంది అని చెప్పవచ్చు. బంగారం ధర ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ స్థాయి అయినా ఒక లక్ష రూపాయల కన్నా కూడా ప్రస్తుతం 3000 రూపాయలు తక్కువగా ఉంది. అయితే త్వరలోనే మళ్లీ బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అమెరికా స్టాక్ మార్కెట్లలో గత రెండు సెషన్లుగా చోటు చేసుకున్న నష్టాలు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.

More News:

News Headlines Telugu

కుప్పకూలిన గోల్డ్ ధరలు..

పరుగులు పెడుతున్న పసిడి ధరలు..

More News: External Sources

మే 21, బుధవారం బంగారం ధరలు ఇవే…ఇప్పటికీ రూ. 3000 తక్కువగానే పలుకుతున్న బంగారం ధర…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *