గత వారం సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ వారం మాత్రం లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత లాభాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 375 పాయింట్లు లాభపడి 81,559 వద్ద ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 24.9 వద్ద ముగిసింది.
నిఫ్టీలో అత్యధికంగా హెచ్‌యూఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభపడగా, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్ నష్టపోయాయి. సెక్టార్లలో ఎఫ్‌ఎంసిజి మరియు బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరగగా క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్, టెలికాం, మీడియా, ఆయిల్ & గ్యాస్, పవర్, రియాల్టీ 0.3-1 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించాయి.