Today Gold And Silver Price: ఇటీవల వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక్కరోజులోనే తులం గోల్డ్ ధర రూ. 660 వరకూ పెరిగింది. వెండి కూడా అదే దారిలో సాగింది. కిలో వెండి ధర రూ. 1,000 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర ప్రస్తుతం రూ. 10,048గా ఉంది. అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 9,210గా నమోదైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 పెరిగి రూ. 92,100కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 660 పెరిగి రూ. 1,00,480కు చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నం వంటి ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 92,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,00,630 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 1,27,000కు చేరగా, ఢిల్లీలో అది రూ. 1,17,000 వద్ద ట్రేడవుతోంది.
Internal Links:
External Links:
ఒక్కరోజులోనే ఇంత మార్పా.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు