Today Gold Prices: అమెరికా వాణిజ్య సుంకాల గడువు ముగుస్తుండటంతో, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై అనిశ్చితి పెరిగింది. ఈ పరిణామం పెట్టుబడిదారుల్లో అప్రమత్తతను కలిగించింది. మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండటమే బంగారం ధరలపై ఒత్తిడికి కారణమని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ నిపుణుడు జతిన్ త్రివేది తెలిపారు. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ముఖ్యంగా వాణిజ్య సంబంధాలపై స్పష్టత లేకపోవడం వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ ఒత్తిడితో పాటు కొన్ని ఇతర అంతర్జాతీయ కారణాల వలన బంగారం ధరలు తక్కువవుతున్నాయి.
ఇటీవల కొన్ని భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ హై స్థాయికి చేరాయి. అయితే ఇప్పుడు ఈ ధరలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల క్రమంలో లక్ష రూపాయల మార్క్‌ను అధిగమించిన బంగారం ధర ప్రస్తుతం తగ్గుతూ రూ.98,000 కంటే తక్కువ స్థాయిలో ఉంది. జులై 8న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,280గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.90,090గా ఉంది. పసిడికి భారతీయుల జీవితాల్లో ప్రత్యేక స్థానం ఉంది. పండగలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల సందర్భంగా మహిళలు పెద్దఎత్తున బంగారం కొనుగోలు చేస్తారు. అయినప్పటికీ నిన్నటితో పోల్చితే బంగారం తులం ధర దాదాపు రూ.400 వరకు తగ్గింది. వెండి ధర కూడా కిలోకు రూ.1,09,900 వద్ద కొనసాగుతోంది. ఇది స్మార్ట్ ఇన్వెస్టర్లకు తగిన అవకాశాలుగా మారే అవకాశం ఉంది.
Internal Links:
ఒక్కరోజులోనే తగ్గిన బంగారం ధర…
External Links:
మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంతంటే..