Today Gold Rates: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పడిపోతుండగా, నేడు మళ్లీ ధరలు తగ్గాయి. తులం గోల్డ్ ధర రూ.60 తగ్గింది. అయితే కిలో వెండి ధర రూ.100 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.10,118గా, 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.9,275గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50 తగ్గి రూ.92,750కి చేరింది.
అదే మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 తగ్గి రూ.1,01,180గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,330గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు కిలో వెండి ధర రూ.1,26,200 ఉండగా, ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ.1,16,200 వద్ద ఉంది.
Internal Links:
వరుసగా ఐదోరోజు తగ్గిన గోల్డ్ రేటు..
External Links:
గోల్డ్ ధరలు మళ్లీ తగ్గినయ్.. సిల్వర్ మాత్రం..