Gold Price

పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.3,000 తగ్గగా, ఈరోజు స్వల్పంగా రూ.110 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.2,750, రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఏప్రిల్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,050గా, 24 క్యారెట్ల ధర రూ.98,240గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఈరోజు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్న వెండి రేటు, ఈరోజు రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి నేడు రూ.1,00,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ.1,10,900గా నమోదయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *