పసిడి ప్రియులకి బిగ్ షాక్ తగిలింది. గత వారం రోజులుగా పెరగని పసిడి ధరలు, నేడు భారీగా పెరిగాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, దిగుమతులు తగ్గడం వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోట చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.510 పెరగగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.550 పెరిగింది. దాంతో వారం రోజుల్లోని పెరుగుదల ఒక్కరోజే కనిపించింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,200గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,310గా నమోదైంది
మరోవైపు వెండి ధరలు కూడా భారీ షాక్ ఇచ్చాయి. గత 10 రోజులుగా పెరగని వెండి.. నేడు రూ.2000 పెరగడం గమనార్హం. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండి ధర రూ.87,000గా నమోదయింది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని సంతోషించిన వారికి నేడు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,310గా, కిలో వెండి ధర 92,000 రూపాయలుగా నమోదయింది.