Today Stock Market Updates

Today Stock Market Updates: అమెరికాతో భారత్ వాణిజ్య డీల్ జరగడం, జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సనాయే తకైచి విజయం సాధించడం వల్ల దేశీయ మార్కెట్‌కు సానుకూల ప్రభావం పడింది. సోమవారం మార్కెట్ బలంగా ప్రారంభమై మంచి జోరుతో సాగుతోంది. సనాయే తకైచి గెలుపుతో ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో కొనసాగుతుండగా, గత వారం భారత్–అమెరికా మధ్య జరిగిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత మార్కెట్‌కు మరింత బలం ఇచ్చింది.

మార్కెట్ ప్రారంభం నుంచి సూచీలు లాభాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ 361 పాయింట్లు పెరిగి 83,941 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 25,804 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL టెక్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్, ఇన్ఫోసిస్ లాభపడగా, పవర్ గ్రిడ్ కార్ప్, మాక్స్ హెల్త్‌కేర్, HUL, M&M, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి. FMCG తప్ప మిగతా అన్ని రంగాల సూచీలు పెరిగాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..

External Links:

అమెరికాతో డీల్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *