గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత కొన్ని రోజులుగా పరుగులు తీసిన బంగారం ధరలు పడిపోతున్నాయి. ఇటీవల పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోయిన కస్టమర్లు పసిడి ధరలు తగ్గుముఖం పడుతుండడంతో ఊరట చెందుతున్నారు. నేడు పుత్తడి ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారంపై ఏకంగా రూ. 650 తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,973, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,225 వద్ద అమ్ముడవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గడంతో రూ. 82, 250 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 తగ్గడంతో రూ. 89,730 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,400గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 89,880 వద్ద ట్రేడ్ అవుతోంది.ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,03,000 వద్ద ట్రేడ్ అవుతోంది.