హైదరాబాద్: యూట్యూబర్, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ కాండ్రేగుల మరో వివాదంలో చిక్కుకున్నారు. షణ్ముఖ్‌తో పాటు అతని అన్న వినయ్ సంపత్‌ను డ్రగ్స్ కేసులో గురువారం నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్ సోదరుడు సంపత్‌పై ఓ మహిళ బుక్ చేసిన చీటింగ్ కేసులో భాగంగా పోలీసులు పుప్పల్‌గూడలోని వారి ఇంటికి వెళ్లి విచారించగా వారు డ్రగ్స్‌లో ప్రమేయం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
షార్ట్‌ఫిల్మ్‌లలో నటిస్తానని చెప్పి షణ్ముఖ్ మోసం చేయగా, అతడి సోదరుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్లి సోదాలు చేయగా సుమారు 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అన్నదమ్ములిద్దరూ తరచూ ఫ్లాట్‌లో గంజాయి తాగేవారని తెలిసింది. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిద్దరూ వేర్వేరు కేసుల్లో అరెస్టయిన సంగతి తెలిసిందే. గతంలో షణ్ముఖ్ జూబ్లీహిల్స్‌లో హిట్ అండ్ రన్ కేసులో అరెస్టయ్యాడు.