కర్నూలు: పాత కక్షల కారణంగా నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రుద్రవరం గ్రామంలో శనివారం అర్థరాత్రి హరిప్రసాద్ (38) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తెలుగుదేశంలో ప్రముఖ కార్యకర్త, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మద్దతుదారుడు హరిప్రసాద్‌కు తోటి పార్టీ కార్యకర్తలతో వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. శనివారం నాడు వర్గాల మధ్య ఘర్షణ పెరిగి హరిప్రసాద్‌పై ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తి కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రియతంరెడ్డి తెలిపారు.