మార్చి 6న 7వ తరగతి చదువుతున్న బాలిక కడుపునొప్పితో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఆమెను చిక్కబళ్లాపూర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆరు నెలల గర్భిణి అని వైద్యులు వెల్లడించారు. అనంతరం జరిగిన నేరాన్ని బాలిక వారికి చెప్పింది. వెంటనే ఆమె తల్లిదండ్రులు మహిళా పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. “మేము నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376 (రేప్), పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ) చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసాము. మేము అతనిని అతని ఇంటి నుండి అరెస్టు చేసాము, ”అని చిక్కబల్లాపూర్ మహిళా పోలీసు స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ బి నిర్మల చెప్పారు.