ఈ మధ్యకాలంలో నేరాలు అధికమవుతున్నాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులను చంపడం ఒక రకమైతే.. కన్న వాళ్లపైనే కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి కారణాలు ఏమైనప్పటికీ ఇలాంటి చర్యలు మాత్రం దేశవ్యాప్తంగా అనేకం జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ అల్వాల్‌‎లో చోటు చేసుకుంది. మత్తుకు బానిసైన కుమారుడు సొంత తండ్రినే చంపేందుకు ప్రయత్నించాడు. కట్ చేస్తే తండ్రి కడుకులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. సుభాష్ నగర్ లో టోని థామస్ అనే రిటైర్డ్ సోల్జర్ తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. కొడుకు డామ్నిక్ థామస్ అతి చిన్న వయసులోనే మద్యం అలవాటు కావడంతో రీ హ్యాబిటేషన్ సెంటర్లో చేర్పించారు. మూడు నెలలపాటు ఇంట్లో థామస్ అతని భార్య మాత్రమే ఉండేవారు.

రీ హ్యాబిటేషన్ కేంద్రం నుంచి మూడు రోజుల క్రితమే కుమారుడు డామ్నిక్ థామస్ ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెంచుకుంటున్న గొర్రెల వ్యవహారంలో తీవ్ర చర్చ నడిచింది. తండ్రి కొడుకుల మధ్య మాట మాట పెరిగింది. దీంతో ఆవేశానికి గురైన కొడుకు ఇంట్లోని డబుల్ బారెల్ గన్ తో తండ్రిని బెదిరించాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన తల్లి భయభ్రాంతులకు లోనైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే రిటైర్డ్ సోల్జర్ ఇంటికి వచ్చిన పోలీసులు ఆతని కుమారుడు డామ్నిక్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గన్ ఎక్కడిది అన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు ఆ గన్ రిన్యూవల్ చేయించకపోవడంపై తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు. లైసెన్స్ లేని మారణాయుధాలను ఇంట్లో ఉంచుకున్నందుకు కేసు బుక్ చేశారు. ఇద్దరినీ పోలీస్ స్టేషన్‎కు తరలించి విచారిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *