భార్యను బైక్ కు కట్టి ఈడ్చుకెళ్లిన పైశాచిక ఘటన రాజస్థాన్ లో జరిగింది మద్యం మత్తులో భార్యను చితకబాదిన ఓ వ్యక్తి. ఆపై తాడుతో ఆమెను తన బైక్‌కు కట్టి ఊరంతా ఈడ్చు కెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నాగౌర్‌లోని నహర్‌సింగ్‌పూర్ గ్రామానికి చెందిన ప్రేమ్‌రామ్ మేఘ్‌వాల్ (32) భార్య సుమిత్ర జైసల్మేర్‌లోని తన సోదరి ఇంటికి వెళ్లాలనుకుంది. ఇదే విషయాన్ని భర్తకు చెబితే ఆయన నిరాకరించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆపై మద్యం తాగొచ్చిన ప్రేమ్‌రామ్ భార్య కాళ్లను తాడుతో తన బైక్‌కు కట్టేసి ఈడ్చుకెళ్లాడు.
దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీంతో స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా, ప్రస్తుతం బంధువుల ఇంట్లో ఉన్న బాధితురాలు భర్తపై ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.