మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఎదురుగా ఉన్న రోడ్లపైకి వెళ్లి అటుగా వస్తున్న బస్సును ఢీకొట్టపోయి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారులో నలుగురు ప్రయాణించగా , అందులో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.