Alia Bhatt’s Ex Assistant Arrested: ఆలియా భట్ మాజీ వ్యక్తిగత సహాయకురాలు వేదికా ప్రకాష్ శెట్టిను రూ.77 లక్షల మోసం కేసులో అరెస్టు చేశారు. 32 ఏళ్ల వేదికా, ఆలియా నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఆమె వ్యక్తిగత ఖాతాల్లో రూ.76.9 లక్షల అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మోసం మే 2022 నుంచి ఆగస్టు 2024 మధ్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలియా తల్లి సోని రజ్దాన్ 2024 జనవరి 23న జుహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నేరపూరిత నమ్మకద్రోహం, మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వేదికా శెట్టి కోసం గాలింపు ప్రారంభించారు.
వేదికా 2021 నుంచి 2024 వరకు ఆలియాకు వ్యక్తిగత సహాయకురాలిగా పని చేసింది. ఈ సమయంలో ఆమె నటి ఆర్థిక వ్యవహారాలు, షెడ్యూల్‌ను చూసేది. దర్యాప్తులో ఆమె నకిలీ బిల్లులను రూపొందించి, ఆలియాతో సంతకం చేయించుకుని డబ్బులు దోచుకున్నట్లు తెలిసింది. అవి నిజమైనవిగా కనిపించేందుకు ప్రొఫెషనల్ టూల్స్ ఉపయోగించిందని పోలీసులు తెలిపారు. సంతకం అయిన తర్వాత, ఆ మొత్తాలను తన స్నేహితురాలి ఖాతాకు బదిలీ చేయించి, తిరిగి తనకు మళ్లించుకునేది. పోలీసులు వేదికా శెట్టిని రాజస్థాన్, కర్ణాటక, పూణే, బెంగళూరు వంటి ప్రాంతాల్లో గాలించి చివరికి బెంగళూరులో అరెస్టు చేశారు. ఆమెను ముంబైకి తరలించారు.
Internal Links:
హర్యానాలో అదృశ్యమైన మోడల్ హత్య..
External Links:
77 లక్షల మోసం చేసిన కేసులో అలియా భట్ మాజీ అసిస్టెంట్ అరెస్ట్