గుంటూరు జిల్లా చేబ్రోలులో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై బాలికను హత్య చేయడం ఏపీలో రచ్చగా మారింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక సోదరుడితో కలిసి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేది. ఇదే క్రమంలో సోమవారం ఇద్దరూ కలిసి బడికి వెళ్లారు. సాయంత్రం సోదరుడు మాత్రమే ఇంటికి తిరిగి వెళ్ళాడు. అయితే బాలిక కనిపించకపోవడంతో కొడుకుని అడిగారు తల్లితండ్రులు మధ్యాహ్నం బాగోలేదని ఇంటికి వెళ్లిపోయినట్టు టీచర్లు చెప్పారని చెప్పాడు కొడుకు.

దీంతో స్కూల్ కి వెళ్లి టీచర్లను అడిగితే, మధ్యాహ్నం బాలిక స్కూల్ నుంచి వెళ్ళిపోయినట్టుగా వాళ్ళు తెలిపారు. అయితే అదే రోజు గ్రామంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే నాగరాజు అనే వ్యక్తి బాలికకు కూల్ డ్రింక్ ఇవ్వడాన్ని గమనించిన కొందరు స్థానికులు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో నాగరాజు ఇంటికి వెళ్లి చూశారు. ఇంటికి తాళం వేసి ఉంది.

ఇంటి బయట బాలిక చెప్పులు కనిపించడంతో కిటికీ ఓపెన్ చేసి లోపలికి చూసారు. గదిలో బాలిక చలనం లేకుండా పడిఉండడంతో తలుపులకు వేసిన తాళాలను పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికే బాలిక అప్పటికే మృతి చెంది ఉంది. అంతేకాదు బాలిక మెడపై , శరీరంపైన గోళ్ళతో గాట్లు పెట్టినట్టు గాయాలు ఉండడంతో బాలిక మృతదేహాన్ని గుంటూరు జిజీహెచ్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *