రాచకొండ కమిషనరేట్, బాలాపూర్ పోలీస్ స్టేషన్ కాంచన్ భాగ్, రియాజ్ అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు పిస్టల్స్‌తో కాల్పులు జరిపారు. బాలాపూర్ పోలీసులు మృతదేహాన్ని విచారణ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు రియాజ్ బాబా నగర్‌లోని సి బ్లాక్‌లో నివాసం ఉంటున్నాడు. బాలాపూర్ ఎన్‌ఆర్‌సీఐ రోడ్డుపై ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో రియాజ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలంలో బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఘటనా స్థలాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, వెస్ట్ జోన్ అదనపు డీసీపీ షేక్ జహంగీర్ పరిశీలించారు. మృతుడు పండ్ల వ్యాపారి ఖాజా రియాజుద్దీన్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పలు కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. ప్రత్యర్థులు కారులో వచ్చి హత్య చేశారని చెబుతున్నారు.