Bhushan verma arrested in hapur

Bhushan verma arrested in hapur: ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జరిగిన జైన మతపరమైన కార్యక్రమంలో భక్తుడి వేషం వేసుకుని సుమారు రూ.1.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించిన భూషణ్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 28 నుంచి అక్కడ జైనుల పవిత్ర పండుగ దశలక్షణ మహాపర్వ జరుగుతుండగా, సెప్టెంబర్ 3న వర్మ పంచెకట్టు వేసుకుని భక్తుడిలా వచ్చి రద్దీని ఆసరాగా చేసుకుని పూజల కోసం ఉంచిన వస్తువులను అపహరించాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు హాపూర్‌లో అతడిని పట్టుకున్నారు.

వర్మ దొంగిలించిన వాటిలో 760 గ్రాముల బంగారు ఝరీ, బంగారు కొబ్బరికాయ, వజ్రాలు, కెంపులు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల బంగారు కలశం ఉన్నాయి. ఇవన్నీ జైన సంప్రదాయ పూజల్లో ముఖ్యమైనవి. నిందితుడు జైన మతస్థుడు కాదని, అతడిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ వస్తువులు వ్యాపారవేత్త సుధీర్ జైన్‌కు చెందినవి. ఆయన ఇవి ప్రతిరోజూ పూజలకు తెచ్చేవారని చెప్పారు. వాటి విలువ కంటే మనసుకు ఉన్న అనుబంధం ఎక్కువని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రస్తుతం దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Internal Links:

సరూర్ నగర్ భర్త హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

బాలికను క్రూరంగా చంపి.. కుందేలుకు ఆరోగ్యం బాగాలేదని విలవిల్లాడిపోయాడు…

External Links:

ఎర్రకోటలో భారీ చోరీ… భక్తుడి వేషంలో రూ.1.5 కోట్ల గోల్డ్ కొట్టేసిన దొంగ అరెస్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *