News5am, Breaking News Latest Telugu (31-05-2025): హైదరాబాద్‌లో విషాదకర ఘటన జరిగింది. మణికొండకు చెందిన జయంత్ గౌడ్ (21) తన తల్లి పుట్టినరోజు వేడుకల కోసం మాదాపూర్‌లోని యశోద హాస్పిటల్ వెనుక ప్రాంతంలో స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సమయంలో మద్యం కూడా సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు అక్కడికి వచ్చి మద్యం బాటిల్ ఇవ్వమని గొడవకు దిగారు. దీంతో వాగ్వాదం జరగగా, క్షణాల్లో అది పెద్దగా మారింది. దుండగులు జయంత్‌పై కత్తులతో దాడి చేయగా, అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమయంలో జయంత్‌తో పాటు ఎనిమిది మంది స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు.
దాడి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన జయంత్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మాదాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, జయంత్ గతంలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి, మూడు నెలల శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చినట్టు సమాచారం.
More Breaking News Latest:
News Latest Telugu:
More Breaking News Latest Telugu: External Sources
తల్లి బర్త్ డే వేడుకలు జరుపుకునేందుకు వెళ్తే.. దారుణ హత్యకు గురైన కొడుకు.. అసలు ఏం జరిగిందంటే?