News5am, Breaking News Telugu News (05/05/2025) : శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ చోరీ సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 1న దర్శనార్థం ఆలయానికి వచ్చిన ఇద్దరు స్థానిక మైనర్ బాలురు హుండీలో చోరీకి పాల్పడ్డారు. ప్రారంభ భాగంలో ఉండే క్లాత్ హుండీని బ్లేడ్‌తో కత్తిరించి డబ్బు తీసుకుంటుండగా ఆ దృశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి. సీసీ టీవీ పర్యవేక్షణలో ఉన్న అధికారులు ఈ విషయాన్ని గమనించి వెంటనే స్పందించి వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10,150 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై శ్రీశైలం దేవస్థానం ఈవో ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి పోలీసులు గోప్యంగా విచారణ జరుపుతున్నారు. గత పది రోజులుగా ఆ బాలురు దర్శనం కోసం క్యూలైన్లలోకి వచ్చి ఇలా దొంగతనానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. చోరీ విషయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆలయ సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఈవో శ్రీనివాసరావు ఉన్నట్టు సమాచారం. ఇక, హుండీ చోరీలో పాల్గొన్న ఇద్దరు మైనర్లతో పాటు మరో ఇద్దరు మేజర్లపై కూడా కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది.
More News:
Breaking News Telugu:
జానులిరితో ప్రేమను ఒప్పుకున్న దిలీప్..
More Breaking Big News: External Sources
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న ఆలయం హుండీలో చోరీ.. ఇద్దరు మైనర్లు సహా నలుగురి అరెస్ట్..!