ఈ మధ్య కాలంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు, తాగాజా రాజేంద్రనగర్‌లో ఓ మహిళ మెడలోని 3 తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. మహిళ బస్టాండ్లో ఉండగా ఈ ఘటన జరిగింది. చైన్ లాగుతున్న సమయంలో ఆమె కింద పడిన కూడా, దుండగులు అలానే ఆమెని లాక్కెళ్లారు. పక్కనే ఉన్న చెట్ల మధ్య నుండి పరారయ్యారు. మహిళను ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే నర్స్ గా గుర్తించారు. ఆమెకి గాయాలు అయ్యాయి. ఆ మహిళ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు అంతకముందు కూడా, ఇదే ప్రాంతంలో రెండు సార్లు చోటుచేసుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *