ఇంటి వద్ద గంజాయి సాగు ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. గంజాయి, హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు చరమగీతం పడాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఒకవైపు రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించింది.
తాజాగా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన కందిమళ్ల వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు శ్రీహరి గత కొన్నేళ్లుగా ఇంటిలో పూలమొక్కల మధ్య గంజాయి మొక్కలు పెంచుతున్నారు. అంతటితో ఆగకుండా నేరుగా స్థానికులకే గంజాయి విక్రయిస్తున్నారు. కిరాణా దుకాణంలో విక్రయించగా వచ్చిన నగదును స్థానిక యువకులకు ఎంపిక చేసి గంజాయిని సరఫరా చేస్తున్నారు.
ఈ సమాచారం పోలీసుల దృష్టికి రావడంతో వారు అసలు విషయం తెలుసుకొని, వెంటనే ఆ గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.