తమ పెద్ద కొడుకు నుండి కాపాడాలంటూ ఓ సీఐ తల్లిదండ్రులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం వేధిస్తున్నారని తల్లిదండ్రులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా, ఖల్లా ఘనపురం మండలం వెంకటయంపల్లి గ్రామానికి చెందిన రఘునాధ్‌రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి సీఐగా, చిన్న కుమారుడు యాదయ్య కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కానీ రఘునాథ్ రెడ్డికి 30 ఎకరాల 23 గుంటల భూమి ఉంది. పెద్ద కొడుకు పేరు మీద 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరు మీద 11 ఎకరాలు. కుతుళ్లకు ఇవ్వడానికి మిగిలిన భూమిని ఉంచుకున్నారు.
కాగా, మరో ఐదెకరాల భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని వారి పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి, సీఐ ఒత్తిడి చేస్తున్నారు. పెద్ద కొడుకు వేధింపులు తట్టుకోలేక చిన్న కొడుకు యాదయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ప్రస్తుతం ఆయన పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీజోన్ 2లో సీఐగా పనిచేస్తున్నారు. తన కొడుకు నాగేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు.