విదేశీ యువతులు, ఇద్దరు కస్టమర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. 17 మంది విదేశీ యువతులను వారి చెర నుంచి రక్షించి సురక్షిత గృహానికి తరలించారు. అల్లాపూర్ పద్మావతినగర్ కు చెందిన శివకుమార్ కొండాపూర్ ప్రొఫెసర్స్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నాడు. కెన్యా, ఉగాండా, టాంజానియా నుంచి భారత్‌కు వచ్చి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉంటున్న యువతుల ప్రొఫైల్‌ను ఓ మహిళ ద్వారా శివకుమార్ సేకరించాడు. కాంటో వెబ్‌సైట్‌లో వివరాలను ఉంచడం ద్వారా వినియోగదారులను ట్రాప్ చేసాడు.

ముంబై, ఢిల్లీ, బెంగళూరుల్లోని యువకులకు అపార్ట్ మెంట్లు, హోటళ్లలో మంచి సౌకర్యాలు కల్పిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు బుధవారం రాత్రి అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి 17 మంది విదేశీయులను రక్షించారు. మేనేజర్ శివకుమార్‌తోపాటు ఇద్దరు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, 20 వేల నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కెన్యా నుంచి 14 మంది, ఉగాండా నుంచి ఇద్దరు, టాంజానియా నుంచి ఒకరు విదేశీ మహిళలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *