హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం రేపింది. ఆదివారం రాత్రి ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పట్టుపడ్డాడు. మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పరారయ్యాడు. నిందితుడి వద్ద నుంచి 170 గ్రాముల ఫారిన్ గంజాయి, 1 కేజీ లోకల్ గంజాయి, బైక్, మొబైల్ ఫోన్‌ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేసింది. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా నుండి హైదరాబాద్‌కు విదేశీ గంజాయి స్మగ్లింగ్అయినట్లు తెలుస్తోంది.
ఈ ఇద్దరు కలిసి ప్రతి వీకెండ్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. బెంగళూరులో లోకల్ గంజాయిని కొనుగోలు చేసి, పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సరఫరా చేశారు. గచ్చిబౌలి, రాయదుర్గం, గౌలిదొడ్డి, ఐటి క్యారిడార్ హాస్టల్స్‌లో ఉండే విద్యార్దులే టార్గెట్‌గా గంజాయి అమ్మకం చేస్తున్నారు. శివరామ్‌తో పాటు అజయ్‌పై పోలీసులు ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడ్డ నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు.