Gold seized from Assam officer

Gold seized from Assam officer:అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నూపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. గౌహతిలోని ఇంట్లో రూ.92 లక్షల నగదు, ఆభరణాలు స్వాధీనం చేశారు. బార్పేట అద్దె ఇంట్లో రూ.10 లక్షలు పట్టుబడ్డాయి. 2019లో సివిల్ సర్వీస్‌లో చేరిన నూపుర్ ప్రస్తుతం కామ్రూప్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా ఉన్నారు. భూ సమస్యల్లో అవకతవకలు ఉన్నాయని అనుమానంతో అధికారులు ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచారని సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు.

శర్మ మాట్లాడుతూ – నూపుర్ బోరా డబ్బు తీసుకొని హిందువుల భూములను ఇతరులకు బదిలీ చేసిందని ఆరోపించారు. అందుకే చర్యలు తీసుకున్నామని తెలిపారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి అధికమని ఆయన వ్యాఖ్యానించారు. నూపుర్ సహాయకుడు సూరజిత్ డేకా ఇంటిపైనా దాడి జరిగింది. ఆయన నూపుర్‌తో కలిసి భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

Internal Links:

మహానటి.. భర్తను పులి చంపిందని భలే నాటకం…

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య

External Links:

అస్సాం టాప్ ఆఫీసర్ నుంచి రూ.2 కోట్ల నగదు, బంగారం స్వాధీనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *