తాజాగా వరంగల్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడింది, కామా మాధవి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, హసన్ విధుల్లో భాగంగా 2011 నుంచి 2021 వరకు పర్తి మండలం మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.
తన వద్ద డబ్బు డిపాజిట్ చేస్తే ఒక నెల (చివరి నెల) చెల్లించాల్సిన అవసరం లేదని, మంచి లాభంతో డబ్బులు చెల్లిస్తానని నమ్మించింది. కృష్ణ అనే వ్యక్తి నెలకు రూ.12,500 చొప్పున మొత్తం 22 నెలల పాటు ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా మాధవి, ఆమె అసిస్టెంట్ వెంకట్‌లకు కృష్ణ రూ.2.75 లక్షలు చెల్లించాడు. చిట్టీ కమిట్‌మెంట్ ప్రకారం జూన్ 2023 నాటికి రూ.3.95 లక్షలు వాపస్ ఇవ్వాల్సి ఉండగా, కృష్ణకు చెల్లించాల్సిన డబ్బులు ఇంతవరకు చెల్లించకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి.
తనను మోసం చేసిన మాధవి, ఆమె అసిస్టెంట్ వెంకట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హసన్ పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిట్టి పేరుతో మోసం చేసిన కామా మాధవి, ఆమె సహాయకుడు వెంకట్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.