తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా ర్రాజేంద్రనగర్‌లో శనివారం హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. ఆరాంఘర్ సమీపంలో ఉన్న చౌరస్తా వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది, తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నం చేసిన వాహనం ఆపకుండా వెళ్ళిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాధితుడు సుమారు 30 ఏళ్ల వయస్సు గలవాడు అని పరిగణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సర్క్యూట్ కెమెరాల నుంచి సేకరించిన ఫుటేజీతో వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.