హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇంట్లోకి చొరబడి బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారయ్యాడు. ఈ ఘటన రాత్రి అఘాపురాలో చోటుచేసుకుంది. దుండగుడి చేతిని ఆ బాలిక కొరికి తప్పించుకోగలిగింది. అనంతరం నాంపల్లి రైల్వే పోలీసులను ఆశ్రయించింది.
బాలిక కిడ్నాప్‌పై పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం నాంపల్లి రైల్వే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక తండ్రి హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.