ప్రకాశం జిల్లా నుంచి నిర్మల్ వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి అరుపులతో అప్రమత్తమైన తోటి ప్రయాణికులు 100కు డయల్ చేశారు. వెంటనే ఓయూ పోలీస్ స్టేషన్ వెళుతున్నట్లు గుర్తించి బస్సును నిలిపివేశారు.
బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లలో కృష్ణ అనే డ్రైవర్ మహిళా ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.