అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్ర‌ముఖ‌ కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద కేసులు నమోదైన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత అతనిపై పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు ఎట్టకేలకు బెంగళూరులో అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *