కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారు. ఏడుగురు అరెస్ట్ ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు సీపి సుధీర్ బాబు తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, “అరెస్ట్ అయినవారిలో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్, అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమంత్ కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్‌లతో పాటు ఆస్పత్రి సిబ్బంది గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలును అరెస్ట్ చేశాం. కిడ్నీ మార్పిడి చేసే ప్రధాన సర్జన్ తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పరారీలో ఉన్నాడు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన మరో సర్జన్ డాక్టర్ సోహెబ్ కూడా పరారీలో ఉన్నాడు. ఆర్గనైజర్లు పవన్, పూర్ణ, లక్ష్మణ్‌ల జాడ కోసం వెతుకుతున్నాం. మీడి యేటర్లు సూరజ్ మిశ్రా, శంకర్లు కూడా తప్పించుకు తిరుగుతున్నారు.” అని సుధీర్ బాబు పేర్కొన్నారు.

డాక్టర్ అవినాష్ ఆపరేషన్ థియేటర్ ఇవ్వడంతో పాటు ఆపరేషన్ తర్వాత పేషెంట్లను చూసుకోవాల్సి ఉంటుంది అని ఒప్పందం కుదిరింది. అలా ఏప్రిల్ 2023 నుంచి 2024 జూన్ వరకు అక్రమ కిడ్నీ మార్పిడి చేస్తూ వచ్చారు. ఈ ఆపరేషన్ అన్నిటిని కూడా వైజాగ్ కి చెందిన పవన్, పూర్ణ, అభిషేకాలు చూసుకునేవారు.” అని సీపి సుధీర్ బాబు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *