మల్లారెడ్డి యూనివర్సిటీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ తరగతి గదిలో అరుణ్(19) అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ తదితర విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద నిరసన తెలిపాయి. మృతుడి బంధువులు, విద్యార్థులు యూనివర్సిటీలోని ఫర్నిచర్‌, అద్దాలను ధ్వంసం చేశారు. ఫర్నీచర్ బయటకు వేసి తగులబెట్టారు. మృతి చెందిన విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుతున్న అరుణ్ కుమార్ మొన్న మృతి చెందాడు. యూనివర్సిటీలో అంబులెన్స్, ప్రథమ చికిత్స సౌకర్యాలు లేకపోవడంతో ఓ విద్యార్థి మృతి చెందాడిని ధర్నా చేపట్టారు. కాలేజీలో అంబులెన్స్ లేకపోవడంతో 20 నిమిషాలు ఆలస్యం చేయడం వల్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పేట్ బషీరాబాద్ పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థి మృతిపై కళాశాల యాజమాన్యం స్పందించి విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *