నాచారం పీఎస్ పరిధిలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన నగరంలో కలకలం రేపింది. నాచారం హాస్టల్‌లో ఏడాది కాలంగా ఉంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంజిమ అనే విద్యార్థిని నిన్న సాయంత్రం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్‌లోని విద్యార్థినులు యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో హాస్టల్ యాజమాన్యం షాక్‌కు గురైంది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంజిమా మృతదేహాన్ని గాంధీ వద్ద ఉంచారు. సంజిమా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంజిమా ఏడాదిలో హాస్టల్‌లో అందరితో బాగానే ఉన్నారని హాస్టల్ యాజమాన్యం పోలీసులకు తెలిపింది. తన రూంలో మిగతా వారు ఏక్కడి వెళ్లారు, సంజిమా ఆత్మహత్య వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి వారు దర్యాప్తు చేస్తున్నారు. సంజిమాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా? అతని బంధువులు హైదరాబాద్‌లో ఉన్నారా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. నర్సింగ్ లో ఏమైన సమస్యలు ఉంటే హాస్టల్ వచ్చి ఆత్మహత్య చేసుకుందా? పోలీసులు విచారిస్తున్నారు. సంజీమ మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.