అప్పట్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ రెండవ అదనపు సెషన్స్ కోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు మరణశిక్ష విధించింది. సుభాష్ శర్మ బీహార్ కు చెందిన నేరస్తుడు. ఈ కేసులో మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

కాగా, తీర్పు సమయంలో నిందితులు శిక్షను తగ్గించాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. అమృత బాబాయి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, తాము పిల్లలు గలవాళ్లమని, ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అతనికి ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ కేసులో ఏ1గా ఉన్న మారుతిరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కసితో మారుతిరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ ను హత్య చేయించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *