ఆన్‌లైన్ బెట్టింగ్, వ్యాపారం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూ.కోటికి పైగా నష్టపోయాడని తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం హైదరాబాద్‌లోని గాజులరామారంలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్​గ్రామానికి చెందిన ఇప్ప కొమురయ్య సింగరేణిలో పనిచేసి విరమణ పొందారు. మంచిర్యాల జిల్లా ఆసుపత్రి రెడ్డి కాలనీలో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు వెంకటేష్ (40)కు జిల్లాలోని సూర్యనగర్‌కు చెందిన వర్షిణి (33)తో వివాహమైంది. వీరికి రిషికాంత్ (11), విహంత్ (3) కుమారులు ఉన్నారు. వెంకటేష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ గాజులరామలోని బాలాజీ లేఅవుట్ సహస్ర అపార్ట్‌మెంట్‌లో మూడేళ్లుగా నివాసం ఉంటున్నాడు.

క్రమంగా ఆన్ లైన్ బెట్టింగ్ , వ్యాపారంతో రూ.20 లక్షలకు పైగా నష్టపోయాడు. అందుకే లోన్ యాప్స్ ద్వారా ఇన్‌స్టంట్ లోన్ తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్య, పిల్లలు అనాథలు అవుతారనే ఉద్దేశంతో శనివారం రాత్రి ముగ్గురిని ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం భార్య చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. స్వగ్రామంలో ఉన్న తండ్రికి అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ నంబర్‌ మెసేజ్ పెట్టాడు. ఆదివారం వాచ్‌మెన్‌కు ఫోన్ చేసి కొడుకును లేపాలని కోరాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరని, తర్వాత నిద్ర లేపుతానని వాచ్‌మెన్ చెప్పాడు. తిరిగి 5:30 గంటలకు మళ్లీ ఫోన్​ చేయడంతో వాచ్​మెన్ వెళ్లి చూడగా, ఇంట్లో అందరూ విగతజీవులుగా పడి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *