ఇటీవల పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ మోసాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉన్నా, ఈజీ మనీ కోసం అత్యాశకు గురౌతున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మరో మహిళ పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో వాట్సాప్ సందేశానికి బలి అయింది. పార్ట్ టైమ్ జాబ్ అని మెసేజ్‌లోని లింక్‌పై క్లిక్ చేసి రూ. 4.72 లక్షలు పోగొట్టుకుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వస్తుందని మెసేజ్‌లు పంపి మోసగాళ్లు మహిళ ఖాతా నుంచి డబ్బు దోచుకున్నారు. డబ్బు పోగొట్టుకున్న ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది. మొదట కొంత మొత్తానికి రిటర్న్స్ ఇచ్చిన నేరగాళ్లు ఆ తర్వాత మహిళ నుండి రూ. 4.72లక్షలు కాజేశారని ఫిర్యాదులో పేర్కొంది మహిళ.