వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌లో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. బుధవారం గ్రామ శివార్లలోని కోట్‌పల్లి ప్రాజెక్ట్ కెనాల్ సమీపంలో గుర్తు తెలియని మహిళ (35) మృతదేహం లభ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళను గుర్తించలేదని, ఆమె ముఖంపై పెట్రోల్ పోసి నిప్పంటించారని వారు తెలిపారు. సంఘటనా స్థలంలో మద్యం సీసాలు, సగానికి కోసిన వాటర్ బాటిల్ కనిపించాయి.
ప్రాజెక్ట్ కెనాల్ గట్టుపై నుంచి కెనాల్‌లోకి డెడ్‌బాడీని ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. మృతురాలి ఎడమ చేతిపై యశోద అని పచ్చబొట్టు ఉంది. పెద్దేముల్ పంచాయతీ కార్యదర్శి లాలప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐ నాగేశ్ తెలిపారు. మహిళను అత్యాచారం చేసి చంపేశారా, లేదా అన్న విషయం పోస్టుమార్టం రిపోర్ట్వచ్చాక తెలుస్తుందని వెల్లడించారు.